అనంతపురంలో బీజేపీ సంబరాలు

ATP: ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించడంతో అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. మంత్రి సత్యకుమార్, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.