బాధ్యతలు చేపట్టిన నూతన పాలకవర్గం

బాధ్యతలు చేపట్టిన నూతన పాలకవర్గం

JGL: రాయికల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సోమవారం బాధ్యతలు చేపట్టింది. మున్సిపల్ ఛైర్మన్‌గా కట్కం రవీందర్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో అధికారిక పత్రాలపై సంతకం చేసి పదవి స్వీకరించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ ముఖ్య అతిథిగా హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు ఎల్.కార్తికేయ, కౌన్సిలర్లు ఉన్నారు.