అభివృద్ధి కార్యక్రమాలు వార్డు, గ్రామ కమిటీలపై చర్చ

శ్రీకాకుళం: కవిటి మండలం రామయ్యపుట్టుగలో ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు ఆధ్వర్యంలో శనివారం స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇచ్చాపురం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వార్డు, గ్రామ కమిటీలపై చర్చించారు. ఇండియా, పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికులకు నివాళులర్పించారు.