గుర్తు తెలియని మృతదేహం లభ్యం
SKLM: ఆమదాలవలస మండలం అక్కివరం పంచాయతీ పరిధిలోని నాగావళి నది తీర ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తి ఒక చెట్టుకు తెల్లటి ప్లాస్టిక్ తాడు సహాయంతో వేలాడుతూ కనిపించినట్లు ఎస్సై బాలరాజు ఆదివారం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.