ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: మంత్రి
AP: ధాన్యం అమ్మిన కేవలం 4 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్రానికి తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోల్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే అనుమతులు రద్దు చేస్తామని ప్రకటించారు.