'ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలకు కృషి'

'ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలకు కృషి'

SRPT: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డీఐఈవో ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అనంతరం ఇంటర్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు.