CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
SKLM: పాతపట్నం నియోజకవర్గానికి చెందిన పలువురకు శనివారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.3,00,059 చెక్కులను బాధితులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, బాధితులు పాల్గొన్నారు.