రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు
కృష్ణా: సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. పండుగ మూడు రోజుల్లో మొత్తం రూ. 38 కోట్లు సేల్స్ నమోదయ్యాయి అని ఎక్సైజ్ అధికారులు సోమవారం తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విక్రయాలు రూ. 4 కోట్లు పెరిగాయి. జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భారీ జనసంద్రమే ఈ పెరుగుదలకు కారణమని వారు అన్నారు.