'నిరంతరం ప్రజా సమస్యలు వెలికి తీసేది జర్నలిస్టులే'

ASR: ఎలాంటి స్వార్ధం లేకుండా నిరంతరం ప్రజా సమస్యలను వెలికి తీసేది జర్నలిస్టులే అని అనంతగిరి మండల జర్నలిస్టులు పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జర్నలిస్టులు అనంతగిరి మండలం చిలకలగెడ్డ గ్రామంలో సచివాలయం వద్ద, రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. నిస్వార్థంగా సమాజ హితం కోరేది జర్నలిస్టులేని వారు తెలిపారు.