మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరు
PLD: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వైసీపీ చేపట్టిన 'కోటి సంతకాల సేకరణ' నరసరావుపేటలో ఉధృతంగా సాగుతోంది. 24వ వార్డులో ఆదివారం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని ప్రైవేటు సంస్థలకు అమ్ముకుంటున్నారని, జగన్ సృష్టించిన సంపదను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు.