ఆ రాష్ట్రాల్లో వేధింపులు.. కేరళ బస్సులు బంద్
తమ రాష్ట్రం నుంచి తమిళనాడు, కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు కేరళ రాష్ట్ర కమిటీ లగ్జరీ బస్సు యాజమానుల సంఘం తెలిపింది. పొరుగు రాష్ట్రాలు భారీ జరిమానాలు విధించడం, చట్టవిరుద్ధమైన రాష్ట్ర స్థాయి పన్నులు విధించడం, తమ బస్సులను సీజ్ చేయటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం కూడా తమకు సహకరించడం లేదని వాపోయింది.