VIDEO: 'చెత్త సమస్యను తక్షణమే పరిష్కరించాలి'
AKP: మాకవరపాలెం పంచాయతీలో చెత్త సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా వోబీసీ ఛైర్మన్ బొంతు రమణ శనివారం డిమాండ్ చేశారు. పంట పొలాలకు వెళ్లే కాలువ సమీపంలో చెత్త చెదారం వేయడం వల్ల వ్యవసాయ భూములకు వెళ్లే రైతులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు స్పందించాలని కోరారు.