రేపటి నుంచి విద్యాసంస్థలు బంద్

TG: రేపటి నుంచి ఉన్నత విద్యాసంస్థలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. 'డిగ్రీ, PG, ఇంజినీరింగ్, ఫార్మ, MBA, B-ED నర్సింగ్ సహా అన్ని కాలేజీలు బంద్ చేస్తున్నాం. రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు జరగవు, పరీక్షలు వాయిదా వేయాలని వర్సిటీలను కోరుతున్నాం. రేపటి నుంచి విద్యార్థులు కళాశాలకు రావొద్దు. ఫీజు బకాయిలు చెల్లించకపోతే బంద్ చేపడతామని గతంలోనే CSకు చెప్పాం' అని పేర్కొన్నాయి.