విదేశీ ఆటగాళ్లను ఆకట్టుకున్న జల్లికట్టు

విదేశీ ఆటగాళ్లను ఆకట్టుకున్న జల్లికట్టు

తమిళనాడు మధురైలో ఇంటర్నేషనల్‌ యూత్‌ వరల్డ్‌ హాకీ టోర్నీ జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు చైనా, బంగ్లాదేశ్‌, ఒమన్‌, ఆస్ట్రియా సహా 8 దేశాల క్రీడాకారులు వచ్చారు. తమిళ సంప్రదాయ క్రీడ గురించి వారికి తెలియజేసేందుకు అలంగనల్లూర్‌కు సమీపంలోని కీజకరై గ్రామంలోని ఓ స్టేడియంలో ప్రత్యేక జల్లికట్టు ఏర్పాట్లు చేశారు. ఈ పోటీలను చూసి విదేశీ ఆటగాళ్లు సంబరపడ్డారు.