సబ్సిడీపై పశువుల మేత పంపిణీ

సబ్సిడీపై పశువుల మేత పంపిణీ

NLR: కొడవలూరు మండలంలోని ఎల్లాయపాలెం గ్రామంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నేత వంశి రెడ్డి ఆధ్వర్యంలో పశు రైతులందరికీ పశువుల మేత పంపిణీ చేశారు. దాదాపుగా నాలుగు టన్నులు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. సబ్సిడీపై ఒక బస్తా రైతుకు 555 రూపాయలు పడుతుందని తెలిపారు. ఒక బస్తా 50 కేజీలు చొప్పున 80 మంది రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్, రైతులు పాల్గొన్నారు.