చీడికాడలో నేటి నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలు: ఎంపీడీవో

చీడికాడలో నేటి నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలు: ఎంపీడీవో

AKP: చీడికాడ మండలంలో ఐదో తేదీ నుంచి ఈనెల 8వ తేది వరకు ఆధార్ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో హేమ సుందర రావు చెప్పారు. ఈ ఆధార్ శిబిరాలు గ్రామ సచివాలయాల్లో జరుగుతాయన్నారు. ఈనెల 5న సిరిజాం, అర్జునుగిరి, 6న ఖండివరం, చుక్కపల్లి, 7న తురువోలు, జీబీపురం, 8న కోనాంలో ఆధార్ శిబిరాలు జరుగుతాయని ఎంపీడీవో తెలిపారు.