భగ్గు మంటున్న భానుడు..!

భగ్గు మంటున్న భానుడు..!

PLD: జిల్లాలో భానుడు భగ్గు మంటున్నాడు. వేసవికాలం వెచ్చదనం గత రెండు, మూడు రోజులుగా కనిపిస్తుందని స్థానిక ప్రజలు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం అమరావతి మండలంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మండుటెండలో ప్రయాణం చేసేందుకు వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజలు ఆదివారం కావడంతో ఎండను చూసి భయపడి ఇంటికే పరిమితమవుతున్నారు.