దేశంలోనే తొలి 'అమార్ఫస్ స్టీల్' ప్లాంట్
జపాన్‌కు చెందిన 'ప్రొటీరియల్' (Proterial) సంస్థ ఏపీలోని శ్రీసిటీలో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి అమార్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్. ట్రాన్స్‌ఫార్మర్లలో విద్యుత్ వృథాను గణనీయంగా తగ్గించే ఈ స్టీల్ ఉత్పత్తితో ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా ఏపీకి ఇది మరో కీలకమైన మైలురాయి.