క్వారీ గుంతలో పడి వ్యక్తి మృతి

క్వారీ గుంతలో పడి వ్యక్తి మృతి

GNTR: వడ్లమూడిలోని క్వారీ గుంతలో పడి శివప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శేకూరు గ్రామానికి చెందిన శివప్రసాద్ మద్యానికి బానిసై భార్యతో విడిపోయి, ఈనెల 16న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. శుక్రవారం క్వారీ గుంతలో అతని మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీర నారాయణ తెలిపారు.