ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా ర్యాలీ

ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా ర్యాలీ

KMM: గాజాపై జరుగుతున్న ఇజ్రాయిల్ దాడులు వెంటనే ఆపాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఇన్సాఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మహమ్మద్ సలాం డిమాండ్ చేశారు. ఈ మేరకు దాడులకు నిరసనగా ఖమ్మం నగరంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఆకలితో అలమటిస్తున్న చిన్నారులను లక్ష్యం చేసుకుని కాల్పులు జరపడం సిగ్గుచేటని అన్నారు. సాంబశివరెడ్డి, హుస్సేన్, ముబిన్, ఖలీల్ ఉన్నారు.