తాండూరు పట్టణంలో ఈనెల 26న సుబ్రహ్మణ్య షష్ఠి
VKB: తాండూరు పట్టణంలో ఈనెల 26న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ప్రకటనలో తెలిపారు. అదే రోజు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. 27న స్వామి వారి పల్లకి సేవ ఉంటుందని పేర్కొన్నారు.