యాదాద్రి దేవస్థానంలో ఉద్యోగాల నోటిఫికేషన్

యాదాద్రి దేవస్థానంలో ఉద్యోగాల నోటిఫికేషన్

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఖాళీగా ఉన్న మతపర సేవా పోస్టుల భర్తీకి దేవాదాయశాఖ ఆదేశాలతో ఆలయ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. వేదపండితులు, పరిచారికులు, వాహన పురోహితులు తదితర ఉద్యోగాలకు 59 పోస్టులకు 18-46ఏళ్లలోపు హిందువులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత పత్రాలతో DEC12 సా.5 లోపు దేవస్థానం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.