జన ఔషధి కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ నగేష్

ADB: జన్నారం మండలంలోని ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని ఆదివారం ఎంపీ గేడం నగేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల ఆరోగ్యం కోసం అతి తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు. దీనిని ప్రజలందరూ వినియోగించుకోవాలని కొరారు.