'విష జ్వరాల నివారణకు అప్రమత్తంగా ఉండాలి'

PDPL: విషజ్వరాల నివారణకు అప్రమత్తంగా ఉండాలని రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి అన్నారు. 100 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం న్యూ మారెడుపాకలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. దోమల నిర్మూలనకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు తొలగించి, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.