8 మంది పేకాట రాయుళ్లు అరెస్టు
KDP: లింగాల మండలం అంబకపల్లిలో శనివారం జూదం ఆడుతున్నారన్న సంచారంతో సీఐ సీతారామిరెడ్డి తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఇందులో జూదం ఆడుతుండగా 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.11,150 స్వాధీనం చేసుకునట్లు సీఐ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.