'బలవంతంగా భూసేకరణ చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటాం'

MDK: రామయంపేట మండల కేంద్రంలో మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి బైపాస్ రోడ్ నిర్మాణ భూసేకరణ ఉద్రిక్తత నెలకొంది. కొందరు నేతలు చెప్పినట్టుగా భూసేకరణ చేస్తున్నారని భూ బాధితులు అధికారుల వద్ద రోదించారు. బలవంతంగా పోలీసులను పెట్టి భూసేకరణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు తీసుకుంటే.. ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.