సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

HYD: ఏడాది పాలన కాలంలో రూ. వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ రెండు లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఏడాది ప్రజా పాలన విజయోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం దూద్బౌలిలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు.