ముత్యాలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు
TPT: రేపటి నుంచి ప్రారంభం కానున్న కనుపూరు ముత్యాలమ్మ జాతర కోసం భక్తుల సౌకర్యార్థం వాకాడు డిపో నుంచి 115 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ చిన్న పెంచలయ్య తెలిపారు. గూడూరు నుంచి 40, నెల్లూరు నుంచి 30, వెంకటగిరి, సూళ్లూరుపేట నుంచి 10 బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. గతేడాది కంటే అదనంగా బస్సులు కేటాయించామని వారు తెలిపారు.