దర్గాను దర్శించుకున్న మంత్రి పయ్యావుల
ATP: ఉరవకొండ పట్టణ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత పేటలోని బీబీ జైనబ్బి దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించారు. నియోజకవర్గ ప్రజల క్షేమం, అభివృద్ధిని కాంక్షిస్తూ ఆయన ఈ పర్యటన సాగించారు. స్థానిక నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.