గాంధీ విగ్రహం చుట్టూ ఇసుక

RR: షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో జాతిపిత, మహాత్మా గాంధీ విగ్రహం చుట్టూ ఇసుకను పోశారు. ఓ గృహ నిర్మాణానికి యజమాని ఇసుక వేయడానికి స్థలం సరిపోకపోవడంతో గాంధీ విగ్రహాన్ని ఉపయోగించుకున్నాడు. అయితే స్థానికులు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూసుకొని ఇసుకను అక్కడి నుంచి తొలగించాలని కోరుతున్నారు.