ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: సిర్గాపూర్ మండలం లక్ష్మణ్ నాయక్ జీపీలో ఖేడ్ MLA సంజీవరెడ్డి నూతన ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన కోలా గుణిబాయి బాబు సింగ్ అనే లబ్ధిదారు ఇందిరమ్మ గృహాన్ని నిర్మించగా ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. సొంతింటి కల నెరవేర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.