పెళ్లిళ్లపై చమురు సంక్షోభం సెగ

పెళ్లిళ్లపై చమురు సంక్షోభం సెగ

దేశంలో చమురు సంక్షోభం సెగ పెళ్లిళ్లపై కూడా పడింది. పంజాబ్ రాష్ట్రంలో ఈ నెలలో దాదాపు 10 వేల వివాహాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో అందరినీ కలవరానికి గురిచేస్తోంది. క్యాటరింగ్ నిర్వాహకులు, మ్యారేజ్ ఫంక్షన్ హాల్ యజమానులు చేతులెత్తేస్తున్నారు. భోజనాల మెనూలో కోతలు విధించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.