జలదంకిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NLR: జలదంకిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని MLA కాకర్ల సురేశ్, సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వ సహకారం అందిస్తూ వారు పండించిన ధాన్యాన్ని నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించడమే ఈ కేంద్ర లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.