గర్భధారణ నివారణపై అవగాహన పెంచాలి: RDO
KDP: బద్వేల్ ఆర్డీవో కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డివిజనల్ స్థాయి వర్క్ షాప్ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీవో చంద్రమౌళి మాట్లాడుతూ.. కౌమార దశలో గర్భధారణ నివారణపై సమాజంలో అవగాహన పెంచాలని, బాల్య వివాహాలను గ్రామ స్థాయి నుంచే అరికట్టాలని సూచించారు. అధికారులు బాలల రక్షణ చట్టాలు, శాఖ పరమైన సేవలపై వివరించారు.