తాండూర్ మున్సిపల్ చెత్త వాహనాలకు మోక్షం

తాండూర్ మున్సిపల్ చెత్త వాహనాలకు మోక్షం

VKB: తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి ప్రత్యేక చొరవతో చెత్త వాహనాలు తిరిగి సేవలోకి వచ్చాయి. శనివారం మున్సిపల్ కార్యాలయానికి ట్రాక్టర్లు, ఆటోలు కలిపి 11 వాహనాలు చేరుకున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు వాహనాల మరమ్మతులు పూర్తిచేసినట్లు కమిషనర్ తెలిపారు. గత రెండేళ్లుగా వాహనాలు చెడిపోయి మెకానిక్ షెడ్లు, రోడ్ల పక్కనపడి ఉన్నాయి.