రేపు గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం

ADB: వన్ టౌన్, టూ టౌన్, మావల, రూరల్ PS పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమావేశం ఉంటుందని డీఎస్పీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు తనిషా గార్డెన్, దస్నాపూర్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి నిర్వాహకులు తప్పకుండా హాజరుకావలన్నారు.