ఎండవేడికి తట్టుకోలేక.. కోళ్ల మృత్యువాత..!
MDCL: ఉప్పల్, నాచారం ప్రాంతాల్లో పెరుగుతున్న ఎండల ప్రభావం పౌల్ట్రీ రంగంపై పడుతోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్నాయి. తీవ్ర వేడిని తట్టుకోలేక పలుచోట్ల కోళ్లు మృతి చెందుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గాలి సౌకర్యం తక్కువగా ఉండటం, తాగునీటి కొరత పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది.