కరీంనగర్‌లో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి

కరీంనగర్‌లో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి

KNR: నగర మేయర్ పలు ప్రాంతాల్లో పర్యటించి అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు. మొదటగా కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి మేయర్, డిప్యూటీ మేయర్, పాలకవర్గ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తీగలగుట్టపల్లి అంబేద్కర్ కాలనీలో విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.