మంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ATP: గుత్తిలో రాష్ట్ర విద్యాశాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన కోసం త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్‌ను వెంటనే సిద్ధం చేయాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని, మంత్రి పర్యటించే ప్రదేశాలలో కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలనీ ఆదేశించారు.