VIDEO: ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలు

VIDEO: ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలు

ASF: కాగజ్ నగర్ పట్టణం సుభాష్ కాలనీలో కరెంట్ సర్వీస్ వైర్లు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. సుదూరంలో ఉన్న స్తంభం నుంచి కనెక్షన్ ఇవ్వడంతో వైర్లు నేలకి దగ్గరగా వేలాడుతున్నాయి. సమీపంలోని స్తంభానికి మార్చాలని పలుమార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.