ఈనెల 30న బసవ జయంతి వేడుకలు

ఈనెల 30న బసవ జయంతి వేడుకలు

KRNL: వీరశైవ లింగాయతుల ఆరాధ్య దైవమైన బసవవేశ్వరుడి జయంతి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రాలయం వీరశైవ లింగాయతులు తెలిపారు. ఈ నెల 30న మంత్రాలయంలోని పాత ఊరిలో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో పంచామృతాభిషేకం నిర్వహిస్తామన్నారు. ఉదయం 8 గంటలకు బసవేశ్వరుడి చిత్రపటాన్ని ఊరేగిస్తామన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు.