ఇంట్లో లీక్ అయిన గ్యాస్‌ సిలిండర్‌‌.. తప్పిన పెను ప్రమాదం

ఇంట్లో లీక్ అయిన గ్యాస్‌ సిలిండర్‌‌.. తప్పిన పెను ప్రమాదం

WGL: గ్యాస్‌ సిలిండర్‌ లీక్ అయ్యి ఇంట్లో ఉన్నవారు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన రాయపర్తి మండలం ఏకే తండాలో బుధవారం చోటు చేసుకుంది. మూడ నరసింహ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా లీక్ అవ్వడంతో అందరినీ ఇంట్లో నుండి బయటకు తీసుకెళ్లి, సిలెండర్‌ను బయట పంటపొలాల్లో పడేశారు. పెనుప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు, తండావాసులు ఊపిరి పీల్చుకున్నారు.