'చంద్రబాబు మోసాన్ని ఎండగడదాం'

'చంద్రబాబు మోసాన్ని ఎండగడదాం'

 NDL: ఎన్నికల ముందు హామీలిచ్చి ప్రజలను మోసగించిన సీఎం చంద్రబాబు నాయుడు తీరును ఎండగట్టాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ .. జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఏడాది చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలు ఎక్కడన్న ప్రశ్నను లేవనెత్తారు నిజాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.