బేస్తవారిపేటలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని అక్కపల్లి, పచ్చల వెంకటాపురం గ్రామంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రఫీక్ కంది పైరులో మారుక మచ్చల పురుగును గమనించి దాని నివారణకు ఇండోక్సి కార్బో 200ml ఒక ఎకరాకు చొప్పున పిచికారి చేసి వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సేవ కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.