BREAKING: నగరంలో అగ్ని ప్రమాదం

BREAKING: నగరంలో అగ్ని ప్రమాదం

TG: హైదరాబాద్‌లోని సోమాజిగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెస్టారెంట్ కిచెన్ నుంచి భారీగా పొగ వస్తోంది. భవనంలోని ఐదో అంతస్తులో రెస్టారెంట్ ఉంది. నాలుగో అంతస్తులో GRT జ్యువెల్లర్స్ ఉంది. రెండు ఫైరింజన్ల ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.