'ఆదోని బైపాస్ రోడ్డులో నాణ్యత పాటించడం లేదు'

KRNL: ఆదోనిలో నెట్టేకల్ క్రాస్ నుంచి ఆలూరు రోడ్డువరకు నిర్మిస్తున్న బైపాస్ రోడ్డులో నాణ్యత పాటించడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్ మండిపడ్డారు. రూ.150 కోట్లతో జరుగుతున్న పనుల్లో ఇంజినీరింగ్ అధికారులు లేకుండానే పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తారు, కంకర సరైన నిష్పత్తిలో వాడకపోవడంతో రోడ్డుపై కంకర తేలుతోందని విమర్శించారు.