APPLY NOW: ఉచిత సివిల్స్ కోచింగ్
AP: SC, ST నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్స్ కోచింగ్ అందించనున్నట్లు మంత్రి DBV స్వామి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 340 మందికి విజయవాడ, విశాఖ, తిరుపతిలోని BR అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో డిసెంబర్ 10 నుంచి ఏప్రిల్ 10 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి 16 వరకు అప్లై చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు స్టడీ సర్కిల్ వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు.