పెరుగుతున్న జ్వర పీడితులు..!

WGL: జిల్లాలో జ్వర పీడితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నట్లుగా వైద్యులు తెలిపారు. ఇక వరంగల్ ఎంజీఎంలో మలేరియా 11, డెంగీ 54 కేసులు నమోదయినట్లు చెబుతున్నారు. జ్వర పీడితుల కోసం 20 ప్రత్యేక బెడ్లు ఎంజీఎంలో ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.