లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవు: కోటాచలం

SRPT: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం హెచ్చరించారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో విలేకరులతో వారు మాట్లాడారు. మండల పరిధిలోని మంచ్యతండాకు చెందిన ఆర్ఎంపీ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ చట్టానికి విరుద్ధంగా పాల్పడడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.