VIDEO: పెళ్ళికొడుకుని ఎత్తుకొని వాగు దాటించిన బంధువులు

VIDEO: పెళ్ళికొడుకుని ఎత్తుకొని వాగు దాటించిన బంధువులు

KNR: గన్నేరువరం మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో పెళ్లికి బయలుదేరిన వరుడు, బంధువులు రోడ్డుపై ప్రవహిస్తున్న వరద కారణంగా ముందుకు వెళ్లలేకపోయారు. వివాహ ముహూర్తం దగ్గర పడుతుండటంతో చేసేదేమీ లేక బంధువులు ఒకరినొకరు సాయం చేసుకుని పెళ్లి కొడుకును తమ భుజాలపై ఎత్తుకుని వాగు దాటారు. ఈ వీడియో SMలో వైరల్ అవుతుంది.